| కీర్తనలు | త్యాగరాజు | మనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ |
| ఈశమనోహరి - ఆది |
| పల్లవి: |
| మనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ మ.. |
| అను పల్లవి: |
| మును బుట్టను పుట్టిన మౌనికృతమున మూడున్నారధ్యాయమునఁ జూచుకో మ.. |
| చరణము(లు): |
| సృష్టి పుష్టి నష్టి సేయు పనులు ని కృష్టమనుచును త్రిమూర్తుల కొసఁగి మ.. |
| తుష్టుఁడై బరగె సద్భక్త మనో భీష్టములిచ్చే త్యాగరాజనుతుని మ.. |