| కీర్తనలు | త్యాగరాజు | మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి |
| మారరంజని - ఆది |
| పల్లవి: |
| మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి? ॥మనసా॥ |
| అను పల్లవి: |
| ఘన దురితమ్ముల గోట గట్టి నా కార్యముల చెరచితివో? ॥మనసా॥ |
| చరణము(లు): |
| పర తారల పర ధనముల కాస బడి చెడి తిరిగితివో లేక పర జీవాత్ముల హింసించితివో వర త్యాగరాజ నుతుని మరచితివో ॥మనసా॥ |