| కీర్తనలు | త్యాగరాజు | మనసా, మన సామర్ధ్యమేమి? |
| వర్ధని - రూపకం |
| పల్లవి: |
| మనసా, మన సామర్ధ్యమేమి? ఓ ॥మనసా॥ |
| అను పల్లవి: |
| విను సాకేతరాజు విశ్వమనే రధము నెక్కి తన సామర్థ్యము చేఁ దానే నడిపించెనే ॥మనసా॥ |
| చరణము(లు): |
| అలనాఁడు వసిష్ఠాదులు బట్టము గట్టే పలు కులు విని వేగమే భూషణముల నొసఁగిన కైకనుఁ పలుమారు జగంబులు కల్లమనిన రవిజుని మాయ వల వేసి త్యాగరాజ వరదుఁడు దాఁ జనగలేదా ॥మనసా॥ |