| కీర్తనలు | త్యాగరాజు | మరియాద గాదయ్యా మనుపవదేమయ్య |
| భైరవి - దేశాది |
| పల్లవి: |
| మరియాద గాదయ్యా మనుపవదేమయ్య మ.. |
| అను పల్లవి: |
| సరివారిలో నన్ను చౌకచేయుటెల్ల శ్రీ హరి హరి నీవంటి కరుణానిధికి మ.. |
| చరణము(లు): |
| తనవారలన్యులనే తారతమ్యము మును ఘనుఁడైన దాశరథికే గలదది కీర్తిగదా నినుఁ బాయనేరని ననుఁ బ్రోవకుండేది ధనదసఖుఁడగు త్యాగరాజపూజిత మ.. |