| శంకరాభరణం - ఆది |
| పల్లవి: |
| మరియాద గాదురా ॥మరియాద॥ |
| అను పల్లవి: |
కరుణాకర! వారిని వీరిని
సరిజేసి చూచు చుండునది ॥మరియాద॥ |
| చరణము(లు): |
రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన
యోగము మఱి యనురాగము లేని
భాగవతు లుదర శయనులే గాని
త్యాగరాజార్చిత తారక చరిత! ॥మరియాద॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mariyaada gaaduraa ( telugu andhra )