| కీర్తనలు | త్యాగరాజు | మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ |
| కాంభోజి - చాపు |
| పల్లవి: |
| మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ మ.. |
| అను పల్లవి: |
| పాహి వదనజితసుధాకరే శ్రీకరే పాహి సుగుణరత్నాకరే మ.. |
| చరణము(లు): |
| దేహి చరణభక్తిమఖిల దేహిని సదాశుభఫల దే హిమగిరితనయే వైదేహీవ సహోదరి మ.. |
| వాహినీశ సన్నుతే నవాహిభూష వల్లభే భ వాహి నీలకంఠి సింహవాహినీ జననీ మ.. |
| పార్థసన్నుతప్రియే పదార్థపుణ్యదూరే కామి తార్థఫలదే శ్రీతపస్తీర్థపురనివాసినీ మ.. |
| రాజశేఖరాత్మభూ విరాజరాజసన్నుతే స రోజ దళనిభాక్షీ త్యాగరాజ భాగ్యదాయకి మ.. |