| కీర్తనలు | త్యాగరాజు | మా రామచంద్రునికి జయమంగళం |
| కేదారగౌళ - ఆది |
| పల్లవి: |
| మా రామచంద్రునికి జయమంగళం ॥మా॥ |
| అను పల్లవి: |
| ఘోర భవ వరనిధి తారకునికి మంగళం ॥మా॥ |
| చరణము(లు): |
| మారుని గన్న రాజ కుమారునికి మంగళం మారులేని హరికి ముమ్మారు జయమంగళం ॥మా॥ |
| బాహులే యాప్తునికి సుబాహు వైరికి మంగళం బాహుజా శూరు డాజాను బాహునికి మంగళం ॥మా॥ |
| బృందావన స్థిరమౌని బృందావనునికి మంగళం బృందాలోలునికి పాలిత బృందారకునికి మంగళం ॥మా॥ |
| రాజవేషునికి రాజ రాజార్చితునికి మంగళం రాజధరుఁడగు త్యాగ రాజ నుతునికి మంగళం ॥మా॥ |