| రవిచంద్రిక - దేశాది |
| పల్లవి: |
మాకేలరా విచారము
మరుఁ గన్న శ్రీరామచంద్ర ॥మ॥ |
| అను పల్లవి: |
సాకేత రాజకుమార
సద్భక్తమందార శ్రీకర ॥మ॥ |
| చరణము(లు): |
జతగూర్చి నాటకసూత్రమును
జగమెల్ల మెచ్చగఁ కరమున నిడి
గతితప్పకాడించేవు సుమ్మీ
నత త్యాగరాజ గిరీశవినుత ॥మ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maakeelaraa vichaaramu ( telugu andhra )