| కీర్తనలు | త్యాగరాజు | మాజానకి చెట్ట బట్టఁగ మహరాజవైతివి |
| కాంభోజి - దేశాది |
| పల్లవి: |
| మాజానకి చెట్ట బట్టఁగ మహరాజవైతివి ॥మా॥ |
| అను పల్లవి: |
| రాజరాజ వర! రాజీవాక్ష! విను రావణారి యని రాజిల్లు కీర్తియు ॥మా॥ |
| చరణము(లు): |
| కానకేగి యాజ్ఞమీఱక మాయా కార మునిచి శిఖిచెంతనేయుండి దానవునివెంటనె చని యశోకతరుమూలనుండి వానిమాటలకు కోపగించి కంట వధియించకనే యుండి శ్రీనాయక యశము నీకే కల్గఁ జేయలేదా త్యాగరాజ పరిపాల ॥మా॥ |