| కీర్తనలు | త్యాగరాజు | మాటాడవేమి నాతో? మాధుర్య పూర్ణాధర |
| నీలాంబరి - దేశాది |
| పల్లవి: |
| మాటాడవేమి నాతో? మాధుర్య పూర్ణాధర! ॥మాటాడ॥ |
| అను పల్లవి: |
| సాటి దొరకని రామ స్వామి! మది రంజిల్ల ॥మాటాడ॥ |
| చరణము(లు): |
| ఎదురెదురు జూచి యెందు గానక నా హృదయమున కెంతో హితవు లేక సదయుఁడని నేనుండగ సముఖము దొరికిన నీ రదవర్ణ శ్రీ త్యాగరాజార్చిత ముద్దుగ ॥మాటాడ॥ |