| కీర్తనలు | త్యాగరాజు | ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా ముదితలార జూతము రారే |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా? ముదితలార జూతము రారే ॥ముచ్చట॥ |
| అను పల్లవి: |
| పచ్చని దేహిని పరమ పావనిని పార్వతిని దలచుచు హరుడేగెడు ॥ముచ్చట॥ |
| చరణము(లు): |
| చల్లని వేల్పుల రీతి నరుల కర పల్లవములను తళుక్కనుచు బిరుదు లెల్ల మెరయ నిజభక్తులు పొగడగ ఉల్లము రంజిల్ల తెల్లని మేనున నిండు సొమ్ములతో మల్లెహారములు మఱిశోభిల్లగ చల్లని వేళ సకల నవరత్నపు పల్లకిలో వేంచేసి వచ్చెడు ॥ముచ్చట॥ |
| హితమైన సకల నైవేద్యంబుల సం మతమున అడగడుగు కారగించుచు మితములేని యుపచారములతో నతిసంతోషమున సతతము జ ప తపముల నొనరించు నతజనుల కభీష్టము లవ్వారిగ వెతకి యొసగుదుననుచు పంచనదీ పతి వెడలి సొగసు మీరగ వచ్చెడు ॥ముచ్చట॥ |
| భాగవతుల హరి నామ కీర్తనము బాగుగ సుస్వరములతో వింత రాగములను యాలాపము చేయు వై భోగములను జూచి నాగభూషణుఁడు కరుణానిధియై వేగము సకల సుజన రక్షణమున జాగరూకుఁడై కోర్కెలనొసగు త్యాగరాజు తాననుచును వచ్చెడు ॥ముచ్చట॥ |