| కీర్తనలు | త్యాగరాజు | ముమ్మూర్తులు గుమిగూడి పొగడే |
| అఠాణ - దేశాది |
| పల్లవి: |
| ముమ్మూర్తులు గుమిగూడి పొగడే ముచ్చట వినుకోరె ము.. |
| అను పల్లవి: |
| సమ్మతిగా రాజు కొడుకనఁగ విని సంశయముదీరక శ్రీరాముని ము.. |
| చరణము(లు): |
| రోసముతో రఘురాముని గుణముల రూఢిగఁ దమగుణముల నటు వ్రాసి త్రాసున నిడ సరినిల్వలేదని త్యాగరాజనుతుఁ డెవఁడో యనుచును ము.. |