| కీర్తనలు | త్యాగరాజు | మేను జూచి మోస బోవకే, మనసా లోని జాడ లీలాగు కదా |
| సరసాంగి - దేశాది |
| పల్లవి: |
| మేను జూచి మోస బోవకే, మనసా! లోని జాడ లీలాగు కదా? ॥మేను॥ |
| అను పల్లవి: |
| హీనమైన మలమూత్ర రక్తముల కిల నెంచు మాయామయ మైన చాన ॥మేను॥ |
| చరణము(లు): |
| కనులనెడి యంప కోలచేత గుచ్చి చనులనెడి గిరుల శిరమునుంచి పనులుచేతురట త్యాగరాజనుతుని బా గ నీవు భజన జేసుకొమ్మి స్త్రీల ॥మేను॥ |