| కీర్తనలు | త్యాగరాజు | మేలు మేలు రామనామ సుఖ |
| సౌరాష్ట్ర - ఆది |
| పల్లవి: |
| మేలు మేలు రామనామ సుఖ మీ ధరలో మనసా ఫాలలోచన వాల్మీకాది బాలానిలజాదులు సాక్షిగ మే.. |
| అను పల్లవి: |
| నిండుదాహముఁగొన్న మనుజులకు నీరుఁ ద్రాగిన సుఖంబుకంటే చండదారిద్ర మనుజులకు ధన భాండమబ్బిన సుఖంబుకంటే మే.. |
| చరణము(లు): |
| ఆకలివేళల పంచభక్ష్య పర మాన్నమబ్బిన సుఖంబుకంటే శ్రీకరుఁడౌ శ్రీరాముని మనసున చింతించు సుఖంబుకంటే మే.. |
| సారహీనమౌ క్రోధ సమయమున శాంతము గల్గు సుఖంబుకంటే నేరని మూఢులకు సకల విద్యా పారముఁ దెలియు సుఖంబుకంటే మే.. |
| రామునిపై నిజభక్తి కలిగి గాన రసముఁ దెలిసిన సుఖంబుకంటే పామర చెలిమి సేయనివారి భావములోని సుఖంబుకంటే మే.. |
| చేయఁదగు వేదాంత విచారణ చేయఁగ గల్గు సుఖంబుకంటే బాయక నిర్గుణభావముగల పర బ్రహ్మానుభవ సుఖంబుకంటే మే.. |
| రాజస తామస గుణములులేని పూజలఁగల్గు సుఖంబుకంటే రాజశిఖామణియైన త్యాగ రాజుకొసంగు సుఖంబుకంటే మే.. |