| కీర్తనలు | త్యాగరాజు | మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు |
| సారమతి - దేశాది |
| పల్లవి: |
| మోక్షముగలదా భువిలో జీవ - న్ముక్తులు గానివారలకు ॥మో॥ |
| అను పల్లవి: |
| సాక్షాత్కార నీసద్భక్తి - సంగీతజ్ఞానవిహీనులకు ॥మో॥ |
| చరణము(లు): |
| ప్రాణానల సంయోగము వల్ల ప్రణవనాదము సప్తస్వరములై బరగ వీణావాదనలోలుఁడౌ శివమనో విధ మెఱుఁగరు త్యాగరాజ వినుత ॥మో॥ |