| కీర్తనలు | త్యాగరాజు | రఘు నందన! రాజ మోహన! రమియింపవే నా మనసున |
| శుద్ధదేశి - దేశాది |
| పల్లవి: |
| రఘు నందన! రాజ మోహన! రమియింపవే నా మనసున ॥రఘు॥ |
| అను పల్లవి: |
| నగజానిలజ నారదాది హృ న్నాళినివాసుఁడైన గాని శ్రీ ॥రఘు॥ |
| చరణము(లు): |
| చిత్తమందు నిన్నుంచి ప్రేమతో - జింతించు సద్భక్తుల నుత్తమోత్తములంచు నా మది నుంచి పూజించ లేదా? తత్తరంబు దీర్ప గారణంబు నీవే తాళ జాల నిక, త్యాగరాజనుత! ॥రఘు॥ |