| కీర్తనలు | త్యాగరాజు | రాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ |
| దేశికతోడి - రూపక |
| పల్లవి: |
| రాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ రా.. |
| అను పల్లవి: |
| తేజి నెక్కి సామంతరాజు లూడిగము సేయ తేజరిల్లు నవరత్నపు దివ్యభూషణము లిడి రంగ రా.. |
| చరణము(లు): |
| కావేరీతీరమునను బావనమగు రంగపురిని శ్రీవెలయు చిత్రవీథిలో వేడ్కగఁ రాగ సేవను గని సురలు విరులచేఁ బ్రేమను పూజించఁగ భావించి త్యాగరాజు బాడఁగ వైభోగరంగ రా.. |