| కీర్తనలు | త్యాగరాజు | రామనామం భజరే మానస |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| రామనామం భజరే మానస ॥రామ॥ |
| చరణము(లు): |
| దొంగరీతి తిరుగంగనేల శ్రీ రంగని పదముల కౌగిలించుకొని ॥రామ॥ |
| ఎవఁడైన హరియెక్కఁడనుచు మది చక్కతనముగని సొక్కి సంతతము ॥రామ॥ |
| ఎందుబోక రాకేందుముఖుని తన యందుజూచి ఫలమందుగోరు శ్రీ ॥రామ॥ |
| దేహమెత్తి సందేహపడక వై దేహి భాగ్యమా దేహి దేహియని ॥రామ॥ |
| సాధు సజ్జనులు బోధచేత భవ బాధ మానవలె సాధకంబుతో ॥రామ॥ |
| దీనుఁడైన సంధానుఁడైన విను మనురాగమున మేనొసంగి శ్రీ ॥రామ॥ |
| రాగరహిత జన భాగధేయుని వి నా గతి యెవ్వరే త్యాగ రాజనుత ॥రామ॥ |