| కీర్తనలు | త్యాగరాజు | రాముని మఱవకవే ఓ మనసా |
| కేదారగౌళ - ఆది |
| పల్లవి: |
| రాముని మఱవకవే ఓ మనసా రా.. |
| అను పల్లవి: |
| రాముని యాగముఁగాచిన పాప వి రాముని సద్గుణధాముని సీతా రా.. |
| చరణము(లు): |
| ధీరుని దైత్యవిదారుని లోకా ధారుని వంశోద్ధారుని సీతా రా.. |
| ధ్యేయుని మునిజనగేయుని ఘననిభ కాయుని దేవరాయుని సీతా రా.. |
| వాసవహృదయనివాసుని బహురవి భాసుని శుభకరవేసుని సీతా రా.. |
| గీతప్రియుని విధాతనుతుని కం జాత బంధుకులజాతుని సీతా రా.. |
| ఈ జగతిని అవ్యాజమున నాప్త స మాజము నను బ్రోచు జగత్పతిని సీతా రా.. |
| దానవహరు నీశానవినుతుని స దా నరోత్తముల మానరక్షకుని రా.. |
| శోభనదుని గిరిజాబాహుని దురి తేభహరుని బహు ప్రభావుని సదా రా.. |
| శీలిని సద్గుణశాలిని ఘనుని గ పాలినుతుని వనమాలిని సీతా రా.. |
| శ్రీగురుచరణములే గతి యనిన స దా గతిజహితుని త్యాగరాజనుతుని రా.. |