| కీర్తనలు | త్యాగరాజు | రార, సీతారమణి మనోహర! |
| హిందోళవసంతము - రూపకము |
| పల్లవి: |
| రార, సీతారమణి మనోహర! ॥రార॥ |
| అను పల్లవి: |
| నీరజ నయన ఒక ముద్దీర ధీర ముంగల ॥రార॥ |
| చరణము(లు): |
| బంగారు వల్వల నే బాగుగఁ గట్టెద మఱి శృంగారించి సేవఁజేసి కౌగిటఁ జేర్చెద ॥రార॥ |
| సారె నుదుటకు గస్తూరితిలకముఁ బెట్టెద సారమైన ముక్తాహారములను దిద్దెద ॥రార॥ |
| యోగము నీపై యనురాగముఁ బాడెద వే రే గతియెవరు? శ్రీత్యాగరాజ వినుత! ॥రార॥ |