| కీర్తనలు | త్యాగరాజు | లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి - లావణ్య నిధిమతి |
| భైరవి - ఆది |
| పల్లవి: |
| లలితే! శ్రీప్రవృద్ధే! శ్రీమతి లావణ్య నిధిమతి ॥లలితే॥ |
| అను పల్లవి: |
| తెలివిని వర్ధిల్లు శ్రీ - తపస్తీర్థ నగర నిలయె ॥లలితే॥ |
| చరణము(లు): |
| తెలియని బాలుఁడగాదా అంబ తెలివి నా సొమ్ముగాదా చలము సేయ మరియాదా చల్లని మాటలు బల్కరాదా ॥లలితే॥ |
| బ్రోచువా రిలను లేక జూచిజూడక పరాకా యీ సుజనుల వేడగ లేక నే దాసుఁడ నీవే గతిగాక ॥లలితే॥ |
| కన్నతల్లి శుభవదనె మీ యన్న దయకు పాత్రుడనె తిన్నగ శరణు జొచ్చితినే త్యాగరాజ మానస సదనె ॥లలితే॥ |