| నీలాంబరి - రూపకము |
| పల్లవి: |
| లాలియూగవే మా - పాలిదైవమా ॥లా॥ |
| అను పల్లవి: |
| లాలియూగవే నును - గాలిదిండి పాన్పుపైని ॥లా॥ |
| చరణము(లు): |
పమ్మిన వేడుకమీఱ తమ్ములతోను
కమ్మనివిడె మొసఁగు యా జనకాత్మజతోను ॥లా॥ |
బొమ్మదేవరతండ్రి భూమీశులతోడను
సమ్మతమున త్యాగరాజు సన్నుతి సేయఁగ ॥లా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laaliyuugavee maa - paalidaivamaa ( telugu andhra )