| కీర్తనలు | త్యాగరాజు | లేకనా నిన్ను జుట్టుకొన్నారు? |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| లేకనా నిన్ను జుట్టుకొన్నారు? ఏకహృదయులై నిత్యానందము ॥లే॥ |
| అను పల్లవి: |
| శ్రీకర! కరుణాసాగర! నిరుపమ చిన్మయా! శ్రిత చింతామణి! నీయెడ ॥లే॥ |
| చరణము(లు): |
| సౌందర్యములలో సుఖము సీతమ్మకు సౌమిత్రికిఁ గనుల జాడల సుఖము ॥లే॥ |
| సుందర ముఖమున సుఖము భరతునికి సుజ్ఞాన రూపమున సుఖము రిపుఘ్నునికి ॥లే॥ |
| చరణ యుగమునందు సుఖమాంజనేయునికి వరగుణ త్యాగరాజ వరదా! నందము ॥లే॥ |