| శహన - ఆది |
| పల్లవి: |
| వందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ ॥వం॥ |
| శ్రీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ ॥వం॥ |
| శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భారమా రాయబారమా రామ ॥వం॥ |
| వింటిని నమ్ము కొంటిని శర - ణంటిని రమ్మంటిని రామ ॥వం॥ |
| ఓడను భక్తి వీడను ఒరుల - వేడను నీవాఁడను రామ ॥వం॥ |
| కమ్మని విడె మిమ్మని వరము - కొమ్మని పలుకరమ్మని రామ ॥వం॥ |
| న్యాయమా నీకాదాయమా ఇంత - హేయమా మునిగేయమా రామ ॥వం॥ |
| చూడుమీ కాపాడుమీ మమ్ము - పోడిమిగాఁ గూడుమీ రామ ॥వం॥ |
| క్షేమము దివ్యధామము నిత్య - నేమము రామనామము రామ ॥వం॥ |
| వేగరా కరుణాసాగర శ్రీ - త్యాగరాజుని హృదయాకర రామ ॥వం॥ |