| కీర్తనలు | త్యాగరాజు | వరలీల గానలోల సురపాల సుగుణజాల |
| శంకరాభరణ - త్రిశ్రలఘు |
| పల్లవి: |
| వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగళ హృదాలయ శృతిమూల సు కరుణాలవాల పాలయాశు మాం వ.. |
| చరణము(లు): |
| సురవందితాప్తబృంద వరమందరధర సుందరకర కుం దరద నేందుముఖ సనందననుత నందనందనేందిరావరా వ.. |
| (ముని)చింతనీయ స్వాంత నరకాంతక నిగ మాంత చరణ సుకాంత కుశల వాంతరహిత దాంతకుజ వ సంత సంత తాంతక స్తుత వ.. |
| వరపూష వంశభూష నతపోషణ మృదుభాషణ రిపుభీషణ నరవేష నగపేషణ వరశేషభూష తోషితానఘ వ.. |
| సుకవీశహృన్నివేశ జగదీ శ కుభవపాశరహిత శ్రీశ సురగణేశహిత జలేశశయన కేశవా శమీశదుర్లభ వ.. |
| రణధీర సర్వసార సుకుమార బుధవిహార దనుజనీరధర సమీకరణ కరుణారసపరిపూర్ణ జారచోర పాహిమాం వ.. |
| నరరక్షక నీరజాక్ష వరరాక్షస మదశిక్షక సురయక్ష సన క రుక్షపతి నుతాక్షహరణ పక్షదక్షశిక్షకప్రియ వ.. |
| రఘురాజ త్యాగరాజనుత రాజదివసరాజనయన భో జగదవనాజనక రాజ సుతా వి రాజరాజ రాజపూజిత వ.. |