| కీర్తనలు | త్యాగరాజు | విదులకు మ్రొక్కెద సంగీత కో |
| మాయామాళవగౌళ - దేశాది |
| పల్లవి: |
| విదులకు మ్రొక్కెద సంగీత కో వి.. |
| అను పల్లవి: |
| ముదమున శంకరకృతసామ నిగమ విదులకు నాదాత్మక సప్తస్వర వి.. |
| చరణము(లు): |
| కమలాగౌరీ వాగీశ్వరీ విధి గరుడధ్వజ శివనారదులు అమరేశ భరత కాశ్యప చండీ శాంజనేయ గుహ గజముఖులు సుమృకండుజ కుంభజ తుంబురు వరసోమేశ్వర శార్ఙ్గదేవ నందీ ప్రముఖులగు త్యాగరాజ వంద్యులకు బ్రహ్మానంద సుధాంబుధి మర్మ వి.. |