| కీర్తనలు | త్యాగరాజు | విన నాసకొని యున్నానురా, విశ్వరూపుఏ |
| ప్రతాపవరాళి - ఆది |
| పల్లవి: |
| విన నాసకొని యున్నానురా, విశ్వరూపుఁడ నే ॥విన॥ |
| అను పల్లవి: |
| మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల ॥విన॥ |
| చరణము(లు): |
| సీతా రమణితో వామన గుంట లాడి గెల్చుట చేత నొకరి కొకరు జూచి యాభావ మెఱిఁగి సా కేతాధిప! నిజమగు ప్రే మతోఁ బల్కుకొన్న ముచ్చట వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత! ॥విన॥ |