| కీర్తనలు | త్యాగరాజు | వేణుగానలోలుని గన, వేయి కన్నులు కావలెనే |
| కేదారగౌళ - రూపకం |
| పల్లవి: |
| వేణుగానలోలుని గన, వేయి కన్నులు కావల నే ॥వేణు॥ |
| అను పల్లవి: |
| అలి వేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగ ॥వేణు॥ |
| చరణము(లు): |
| వికసిత పంకజ వదనలు వివిధ గతుల నాడగ నొకరి కొకరు కరమున నిడి యోరకనుల జూడగ శుకరవములు గల తరుణులు సొగసుగాను బాడగ సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చు ॥వేణు॥ |