| సురటి - దేశాది |
| పల్లవి: |
| వేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి ॥వే॥ |
| అను పల్లవి: |
| ఈరేడు లోకముల కా ధారుఁడగు నిన్ను వినా ॥వే॥ |
| చరణము(లు): |
బృందారకాది ముని బృంద శుక సనక స
నందన శ్రీనారదారవిందోద్భవ శ్రీ భవ పు
రందరులకు, త్యాగరాజునికి నిన్ను వినా ॥వే॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - veerevvareegati, veemaarulaku, siitaapati ( telugu andhra )