| కీర్తనలు | త్యాగరాజు | శంభోమహాదేవ శంకర గిరిజారమణ |
| పంతువరాళి - చాపు |
| పల్లవి: |
| శంభోమహాదేవ శంకర గిరిజారమణ శం.. |
| అను పల్లవి: |
| శంభో మహాదేవ శరణాగతజనరక్షక అంభోరుహలోచన పదాంబుజ భక్తిం దేహి శం.. |
| చరణము(లు): |
| పరమదయాకర మృగధరధర గంగాధర ధరణీ ధరభూషణ త్యాగరాజవర హృదయనివేశ సురబృంద కిరీటమణివర నీరాజితపద గో పురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవహర శం.. |