| కీర్తనలు | త్యాగరాజు | శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన |
| సామ - ఆది |
| పల్లవి: |
| శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన ॥శాం॥ |
| అను పల్లవి: |
| దాంతునికైన వే - దాంతునికైన ॥శాం॥ |
| చరణము(లు): |
| దారసుతులు ధన ధాన్యము లుండిన సారెకు జప తప సంపదగల్గిన ॥శాం॥ |
| యాగాదికర్మము లన్నియుఁజేసిన బాగుగ సకలహృద్భావముఁ దెలిసిన ॥శాం॥ |
| ఆగమశాస్త్రము లన్నియు జదివిన భాగవతులనుచు బాగుగఁ బేరైన ॥శాం॥ |
| రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ రాజవినుత సాధురక్షక తనకుప ॥శాం॥ |