| కీర్తనలు | త్యాగరాజు | శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా |
| సౌరాష్ట్ర - ఆది |
| పల్లవి: |
| శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా శ్రో.. |
| అను పల్లవి: |
| వాగధిపతి సుపూజలఁ జేకొని బాగ నటింపుచును వెడలిన శ్రీ.. |
| చరనము(లు): |
| పనసనారికేళాది జంబూఫలము లారగించి ఘనతరంబునను మహిపై పదములు ఘల్లుఘల్లున నుంచి అనయము హరి చరణయుగముల హృదయాంబుజమున నుంచి వినయమునను త్యాగరాజవినుతుని వివిధగతుల ధళంగుమని వెడలిన శ్రీ.. |