| కీర్తనలు | త్యాగరాజు | శ్రీమానినీ మనోహర, చిరకాలమైన మాట యొకటిరా |
| పూర్ణషడ్జము - దేశాది |
| పల్లవి: |
| శ్రీమానినీ మనోహర చిరకాలమైన మాట యొకటిర వేమారు బల్క జాలరా ॥శ్రీ॥ |
| అను పల్లవి: |
| శ్రీమంతులౌ నీ సోదరులు జేయు రీతి పాద సేవ కోరితిని ॥శ్రీ॥ |
| చరణము(లు): |
| ధర్మాద్యఖిల పురుషార్థములు దాశార్హుని రూపమబ్బిన మర్మంబు వేరె యున్నది మన్నింపుమిక త్యాగరాజనుత ॥శ్రీ॥ |