| యదుకులకాంభోజి - జంప (దివ్యనామము) |
| శ్రీరామ జయరామ శృంగారరామ యని - చింతింపరాదె ఓ మనసా ॥శ్రీ॥ |
| తళుకుఁ జెక్కుల ముద్దుఁబెట్టు కౌసల్య మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| దశరథుఁడు శ్రీరామ రారయని బిలువ మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| తనివారఁ బరిచర్య సేయ సౌమిత్రి మును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| తనవెంటఁ జనఁ జూచి యుప్పొంగ కౌశికుఁడు - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| తాపం బణఁగి రూపవతి యౌట కహల్య - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| ధర్మాత్మ చరణంబు సోక శివచాపమును - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| తనతనయ నొసఁగి కనులారఁ గన జనకుండు - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| దహరంబు కరుగ కరమును బట్ట జానకి - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |
| త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని - తపమేమి జేసెనో తెలియ ॥శ్రీ॥ |