| కీర్తనలు | త్యాగరాజు | శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే |
| అమృతవాహిని - ఆది |
| పల్లవి: |
| శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తమునకు రావే ॥శ్రీరామ॥ |
| అను పల్లవి: |
| వారిజభవ సనక సనందన వాసవాది నారదు లెల్ల పూజించు ॥శ్రీరామ॥ |
| చరణము(లు): |
| దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరుని రాల్చగ శూర! అహల్యను జూచి బ్రోచితివి యారీతి ధన్యు సేయవే త్యాగరాజగేయ! మా ॥శ్రీరామ॥ |