| కీర్తనలు | త్యాగరాజు | శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించరాదె ఓ మనసా |
| యదుకులకాంభోజి - ఝంప |
| పల్లవి: |
| శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించరాదె ఓ మనసా ॥శ్రీరామ॥ |
| చరణము(లు): |
| తళుకు చెక్కుల ముద్దు బెట్టు కౌసల్య మును తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| దశరథుఁడు శ్రీరామ రారయని పిల్వ మును తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| తనితపర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| తనవెంట చనజూచి యుప్పొంగ కౌశికుఁడు తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| ధర్మాత్ము చరణంబుసోక శివచాపంబు తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |
| త్యాగరాజా ప్తయని పొగడ నారదమౌని తపమేమి జేసెనో తెలియ ॥శ్రీరామ॥ |