| కీర్తనలు | త్యాగరాజు | శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ |
| గోపికా వసంత - ఆది (నీలాంబరి - జంప) |
| పల్లవి: |
| శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ధి సోమ నారాయణాప్తకామా నళినాక్ష పవ్వళించు శ్రీ.. |
| అను పల్లవి: |
| పల్లవాధర వరేణ్య పాపేభసింహధన్య మల్లికాతల్పమందు మాధవ పవ్వళించు శ్రీ.. |
| చరణము(లు): |
| ధారాధరాభదేహ తారాధిపానన సదా నీరాక కోరియుంటి శ్రీరామ పవ్వళించు శ్రీ.. |
| జనకరాజింట బుట్టి జానకి జెట్టబట్టి కనకమౌ సురటిబట్టి గాచినది పవ్వళించు శ్రీ.. |
| వర్ణింపతరముగాని స్వర్ణంపు మేని సీత పూర్ణమౌ భక్తితోను బూజించు పవ్వళించు శ్రీ.. |
| ఆశుగాశన సుశయన అంభోజపత్రనయన ఆశతో త్యాగరాజు అర్చించు పవ్వళించు శ్రీ.. |