| కీర్తనలు | త్యాగరాజు | సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా |
| ధన్యాసి - దేశాది |
| పల్లవి: |
| సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా ॥సం॥ |
| అను పల్లవి: |
| భృంగి నటేశ సమీరజ ఘటజ మ తంగ నారదాదు లుపాసించే ॥సం॥ |
| చరణము(లు): |
| న్యాయాన్యాయము దెలుసును జగములు మాయామయమనె దెలుసును దుర్గుణ కాయజాది షడ్రిపుల జయించే కార్యము దెలుసును త్యాగరాజునికే ॥సం॥ |