| ఫలమంజరి - దేశాది |
| పల్లవి: |
| సనాతన పరమపావన ఘనాఘనవర్ణ కమలానన స.. |
| అను పల్లవి: |
| తనవాఁడనే యభిమానము దైవమైన నీకేల కలుగదు స.. |
| చరణము(లు): |
రాజాధిపాన్వయ సాగరరాజు నీవై విలసిల్లి తే
తేజరిల్లఁగా కృపఁ జూతువె ఈ జగాన త్యాగరాజసన్నుత స.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sanaatana paramapaavana ghanaaghanavarNa kamalaanana ( telugu andhra )