| కీర్తనలు | త్యాగరాజు | సమయముఁ దెలిసి పుణ్యము లార్జించని |
| అసావేరి - చాపు |
| పల్లవి: |
| సమయముఁ దెలిసి పుణ్యము లార్జించని కుమతియుండి యేమి పొయ్యేమి స.. |
| అను పల్లవి: |
| శమతతోడి ధర్మము జయమేగాని క్రమముతో మనవిని వినవే ఓ మనసా స.. |
| చరణము(లు): |
| సారమౌ కవితల విని వెర్రివాఁడు సంతోషపడి యేమి పడకేమి చేరెడేసి గుడ్డికన్నులు బాగ తెఱచి యేమి తెఱవకున్న నేమి స.. |
| తురక వీథిలో విప్రునికి పానకపూజ నెరయఁజేసి యేమి సేయకుంటె నేమి ధరనీని ధనకోట్లకు యజమానుఁడు దయ్యమైతే నేమి లోభైతే నేమి స.. |
| పదము త్యాగరాజనుతునిపై గానిది పాడియేమి పాడకుంటె నేమి ఎదను శ్రీరామభక్తియులేని నరజన్మ మెత్తియేమి ఎత్తకుంటే నేమి స.. |