| కీర్తనలు | త్యాగరాజు | సరస సామ దాన భేద దండ చతుర |
| కాపీనారాయణి - దేశాది |
| పల్లవి: |
| సరస సామ దాన భేద దండ చతుర సాటి దైవ మెవరె బ్రోవవే ॥స॥ |
| అను పల్లవి: |
| పరమశాంభవాగ్రేసరుం డనుచు బల్కు రావణుఁడు తెలియలేకపోయె ॥స॥ |
| చరణము(లు): |
| హితవుమాట లెంతో బాగ బల్కితివి సతముగా నయోధ్య నిచ్చే నంటివి నతసహోదరుని రాజుఁ జేసి రాక హతము జేసితివి త్యాగరాజ నుత ॥స॥ |