| కీర్తనలు | త్యాగరాజు | సరసీరుహాసన రామ సమయము బ్రోవ చిద్ఘన |
| ముఖారి - దేశాది |
| పల్లవి: |
| సరసీరుహాసన! రామ! సమయము బ్రోవ చిద్ఘన! ॥సరసీ॥ |
| అను పల్లవి: |
| పరభామల నాశించి యన్న మిడి పగలు రేయి సరసమాడు వారినొల్ల ॥సరసీ॥ |
| చరణము(లు): |
| బ్రాహ్మణీకము బాయు నీచుల బ్రతుకాయె నదిగాక యీ కలిలో బ్రహ్మమైన మాటల నేర్చుకొని బరగెదరయ్యా త్యాగరాజనుత! ॥సరసీ॥ |