| కన్నడ - రూపక |
| పల్లవి: |
| సాకేత నికేతన సాకే ననఁగలేదా సా.. |
| అను పల్లవి: |
| నీకే మరులైతిని నీకేల ఈ గుణము సా.. |
| చరణము(లు): |
రాకేందుముఖ ఇంతపరాకేమి నెనరున నీ
రాకే మిగుల కోరితిరా కేశిహరణ
రాకేమైన చెప్పకురా కేకలు వేతురు
రా కేశవ శ్రీత్యాగరాజనుత శుభచరిత సా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - saakeeta nikeetana saakee nana.rgaleedaa ( telugu andhra )