| కీర్తనలు | త్యాగరాజు | సాక్షిలేదనుచు సాధింపకే |
| బంగాళ - దేశాది |
| పల్లవి: |
| సాక్షిలేదనుచు సాధింపకే సత్యసంధ సద్భక్తపాలక సా.. |
| అను పల్లవి: |
| వీక్షకాదులెల్ల నవ్వరా జగత్ సాక్షివంశ నీరధి పూర్ణచంద్ర సా.. |
| చరణము(లు): |
| శక్తి నీయెడ నిండారలేదా పరా శక్తి బ్రోవలేదా విషయమందు వి రక్తి కల్గు శ్రీ త్యాగరాజుని నిజ భక్తి నీ వెఱుఁగలేవ మానవుల సా.. |