| కీర్తనలు | త్యాగరాజు | సీతాకల్యాణ వైభోగమే |
| శంకరాభరణము - ఖండలఘువు |
| పల్లవి: |
| సీతాకల్యాణ వైభోగమే ॥సీ॥ |
| అను పల్లవి: |
| పవనజస్తుతిపాత్ర పావనచరిత్ర రవిసోమవరనేత్ర రమణీయగాత్ర ॥సీ॥ |
| భక్తజనపరిపాల భరితశరజాల భుక్తిముక్తిదలీల భూదేవపాల ॥సీ॥ |
| పామరాసురభీమ పరిపూర్ణకామ శ్యామ జగదభిరామ సాకేతధామ ॥సీ॥ |
| సర్వలోకాధార సమరైకవీర గర్వమానసదూర కనకాగధీర ॥సీ॥ |
| నిగమాగమ విహార నిరుపమశరీర నగధరాఘవిదూర నతలోకాధార ॥సీ॥ |
| పరమేశ నుతగీత భవజలధిపోత తరణికులసంజాత త్యాగరాజనుత ॥సీ॥ |