| కీర్తనలు | త్యాగరాజు | సీతాకల్యాణ వైభోగమే, రామ కల్యాణ వైభోగమే |
| శంకరాభరణం - ఖండలఘువు |
| పల్లవి: |
| సీతాకల్యాణ వైభోగమే రామ కల్యాణ వైభోగమే ॥సీతా॥ |
| అను పల్లవి: |
| పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమ నవనేత్ర రమణీయ గాత్ర ॥సీతా॥ |
| చరణము(లు): |
| భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల ॥సీతా॥ |
| పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ ॥సీతా॥ |
| సర్వలోకాధార సమరైక ధీర గర్వమానసదూర కనకాగధీర ॥సీతా॥ |
| నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ రాఘ విదార నత లోకాధార ॥సీతా॥ |
| పరమేశనుత గీత భవజలధి పోత తరణికుల సంజాత త్యాగరాజనుత ॥సీతా॥ |