| కీర్తనలు | త్యాగరాజు | సీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా |
| కమాస్ - దేశాది |
| పల్లవి: |
| సీతాపతీ నామనసున - సిద్ధాంతమని యున్నానురా ॥సీ॥ |
| అను పల్లవి: |
| వాతాత్మాజాదుల చెంతనే - వర్ణించిన నీపలుకులెల్ల ॥సీ॥ |
| చరణము(లు): |
| ప్రేమఁజూచి నాపై పెద్ద మనసుఁజేసి నీ మహిమలెల్ల నిండారఁ జూపి ఈ మహిని భయమేటి కన్నమాట రామచంద్ర త్యాగరాజ వినుత ॥సీ॥ |