| కీర్తనలు | త్యాగరాజు | సుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర |
| బేగడ - రూపక |
| పల్లవి: |
| సుందరి నన్నిందరిలోఁ జూచి బ్రోవవమ్మ త్రిపుర సుం.. |
| అను పల్లవి: |
| సందడియని ఇందుముఖి జాలము వద్దమ్మ త్రిపుర సుం.. |
| చరణము(లు): |
| బాలే పాలితసురజాలే గమనజిత మ రాళే స్వకృతాఖిలలీలే తిలకాంకిత ఫాలే నీ భక్తియు మేలే నీ దయ రా దేలే తల్లి త్రిపుర సుం.. |
| వాణీ వినుతే శుకపాణీ వరశేష వేణీ లలితే కల్యాణీ సాంబశివుని రాణీ మాధుర్యవాణీ నమ్మితిఁ బూ బోణీ తల్లి త్రిపుర సుం.. |
| వారీశస్తుతగంభీరే యాదిపుర వి హారీ దీనజనాధారీ నగరాజ కు మారీ దుష్కర్మవిదారీ త్యాగరాజు కోరియున్న త్రిపుర సుం.. |