| కీర్తనలు | త్యాగరాజు | సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది |
| ఆరభి - చాపు |
| పల్లవి: |
| సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సురలకైన తరమా సుం.. |
| అను పల్లవి: |
| కుందరదన సనందనాది వందిత నేనెంత త్రిపుర సుం.. |
| చరణము(లు): |
| కలకలమను ముఖకళలను గని కలు వలరాజు భువికి రాఁడాయె చెలఁగు నీ లావణ్యమును గని యలనాఁడె వలరాజు గానకపోయె నిలువరమగు నీ గంభీరమును గని జలరాజు జడవేషుఁడాయె బలమైన ధీరత్వమును గని కనకా చలుఁడు తా శిలరూపుఁడాయె త్రిపుర సుం.. |
| కనులను గని సిగ్గుబడి గండుమీనులు వనధివాసము సేయనాయె జనని నీ చిఱునవ్వుకాంతి సోకి శివుఁ డనుపమౌ శుభ్రుఁడాయె మినుకు సొమ్ముల చేలకాంతులు మెఱపులు గని నిమిషము నిలువదాయె కనకాంగి నీ స్వరమును విని వాణి మ గని జిహ్వను దాఁ బూనికాయె త్రిపుర సుం.. |
| పావనము సేయు బిరుదును గని భక్త పాపము పారిపోనాయె ఏ వేళ నీ దయచేత సత్కవులెల్ల కావ్యములను సేయనాయె మా వరునికి చెల్లెలని సంతోసమున దేవి పెద్దలు బల్కనాయె భావించి నీ పాదమున త్యాగరాజు భావుకమనుకోనాయె త్రిపుర సుం.. |