| కమాస్ - రూపకము |
| పల్లవి: |
| సుజన జీవన సుగుణభూషణ రామ ॥సు॥ |
| అను పల్లవి: |
భుజగభూషణార్చిత బుధజనావనా
అజవందిత శ్రితచందన దశతురంగ మామవ ॥సు॥ |
| చరణము(లు): |
చారునేత్ర శ్రీకళత్ర శ్రీరమ్యగాత్ర
తారకనామ సుచరిత్ర దశరథపుత్ర
తారకాధిపానన ధర్మపాలక
తారయ రఘువర నిర్మల త్యాగరాజసన్నుత ॥సు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sujana jiivana suguNabhuushhaNa raama ( telugu andhra )